టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ 2019లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడానికి గల కారణాలను తాజాగా వెల్లడించాడు. 2019 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంతో పాటు ఆటను ఆస్వాదించలేకపోవడం, సరైన గౌరవం-మద్దతు లభించలేదన్న భావనే రిటైర్మెంట్కు దారితీసిందన్నాడు. మానసికంగా, శారీరకంగా ఇక ముందుకు సాగలేనని అనిపించడంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు సానియా మీర్జాతో ఓ పాడ్కాస్ట్లో చెప్పాడు. యువరాజ్ కెరీర్లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa