దేశంలో నెలకొన్న వాస్తవ సంక్షోభాలను కేంద్ర బడ్జెట్ పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ బడ్జెట్ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదని, ఇది కేవలం కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చేలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి కీలక సమస్యలను ఈ బడ్జెట్ విస్మరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇది దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa