ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాన్సర్ మందులపై తగ్గిన పన్ను భారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 01, 2026, 03:25 PM

నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో భాగంగా క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులపై పన్ను భారం తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. 17 రకాల ప్రాణ రక్షక క్యాన్సర్ మందులపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్యతో ఖరీదైన చికిత్సలు మరింత మందికి అందుబాటులోకి వస్తాయి. క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మల వివరించారు.ఈ ఔషధాలపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 0%కి తగ్గించినట్లు చెప్పారు. దీంతో పాటు అరుదైన వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మందులు, ప్రత్యేక వైద్య ఆహారాల దిగుమతిపైనా పన్ను మినహాయిస్తున్నట్లు తెలిపారు. దీంతో క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మందుల ధరలు తగ్గి, రోగులపై ఆర్థిక భారం తగ్గనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa