AP: గుంటూరుకు చెందిన కిరణ్ కోల్పాకుల, తన వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్ 'DDC 0001' కోసం బిగ్ బాయ్ టాయ్జ్ (BBT) వేలం యాప్ ద్వారా రూ.2.08 కోట్లు వెచ్చించి దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్ డీల్‌గా చరిత్ర సృష్టించారు. ఈ వేలం అరుదైన, విలాసవంతమైన వస్తువులను సేకరించేవారు ఎంత ధరకైనా వెనకాడరని నిరూపించింది. గతంలో రూ.1.17 కోట్లకు అమ్మకానికి వచ్చిన ప్లేట్ రద్దయింది. BBT ఆక్షన్ హౌస్ సెలబ్రిటీల లగ్జరీ కార్లను కూడా వేలంలో ఉంచుతుంది.మరోవైపు ఈ నంబర్ ప్లేటును కొనుగోలు చేసింది ఏపీలోని గుంటూరుకు చెందిన కిరణ్ కొలపాకుల అనే వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ డీల్ గురించి బిగ్ బాయ్ టాయ్జ్ సంస్థ ఇన్‌స్టాలో షేర్ చేసింది. మరోవైపు డిసెంబర్ 2022లో ఆహూజా తాను కొనుగోలు చేసిన కొత్త వాహనం గురించి.. వీఐపీ నంబర్ ప్లేట్ గురించి ఫోటో పంచుకున్నారు.మరోవైపు బిగ్ బాయ్ టాయ్జ్ ఆక్షన్ హౌస్.. సెలబ్రిటీల ఖరీదైన కార్లను విక్రయిస్తూ ఉంటుంది. శిల్పా శెట్టి, రోహిత్ శెట్టి, క్రికెటర్ దినేశ్ కార్తీక్, వంటి వీఐపీల కార్లను ఇప్పటి వరకూ విక్రయించింది. 'DDC 0001' నంబర్ ప్లేట్‌తో పాటుగా మరికొన్ని వీఐపీ నంబర్ ప్లేట్లు కూడా వేలంలో ఉన్నాయి. “CHE78", HR59 0001", వంటి నంబర్ ప్లేట్లను ఈ సంస్థ వేలంలో ఉంచింది. ఖరీదైన వాచీలను కూడా ఈ సంస్థ వేలంలో ఉంచుతోంది. మరోవైపు గతేడాది “HR 88 B 8888" అనే వాహనం నంబర్ రూ.1.17 కోట్లకు అమ్ముడై వార్తల్లో నిలిచింది. అయితే బిడ్డర్ సకాలంలో డబ్బు చెల్లించలేకపోయారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa