ట్రెండింగ్
Epaper    English    தமிழ்

UPI లావాదేవీలు రూ.230 లక్షల కోట్లకు చేరాయి: ప్రభుత్వం

business |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 06:38 PM

డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులు సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ నెలలో కొనుగోళ్ల చెల్లింపుల లావాదేవీలు అధికంగా యూపీఐ పద్ధతిలో జరగడంతో వీటి సంఖ్య, విలువ భారీగా పెరిగినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది.జనవరిలో యూపీఐ ద్వారా 28.33 మిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి. వీటి సగటు విలువ 21.7 బిలియన్లుగా ఉందని నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. జనవరిలో సగటు రోజువారీ 700 మిలియన్ల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. డిసెంబర్‌లో రోజూవారీ లావాదేవీల సంఖ్య 698 మిలియన్లుగా నమోదవ్వగా.. వాటి విలువ రూ.27.97 లక్షల కోట్లుగా ఉందని ఎన్‌పీసీఐ పేర్కొంది. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం లావాదేవీల విలువ 21 శాతం వృద్ధి చెందింది. వరల్డ్‌ లైన్ సీఈఓ (CEO) రమేశ్‌ నరసింహన్ మాట్లాడుతూ.. యూపీఐ (UPI) వృద్ధి వేగం కొనసాగుతోందన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa