ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఐ టూల్స్‌పై ఆందోళన వద్దు.. గూగుల్, ఎన్విడియా సీఈఓలు

Technology |  Suryaa Desk  | Published : Fri, Feb 06, 2026, 02:38 PM

అమెరికా ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ కొత్త ఏఐ టూల్‌ను విడుదల చేయడంతో టెక్ కంపెనీలు ఆందోళనకు గురయ్యాయి. దీనిపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పందిస్తూ, భయపడాల్సిన అవసరం లేదని, ఏఐ ఒక సాధారణ సపోర్టింగ్ టూల్ అని అన్నారు. గ్లోబల్ మార్కెట్ల (Global Markets)తో పాటు ఆయా సేవలు అందించే దేశీయ ఐటీ కంపెనీలూ తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. అమెరికాతో పాటు యూరోప్‌లోని వాణిజ్య సంస్థల కోసం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, నిర్వహణ సేవలను మన ఐటీ కంపెనీలు అందిస్తాయి. మన ఐటీ కంపెనీల ఆదాయంలో ఎక్కువ భాగం ఆయా దేశాలనుంచే వస్తోంది. ఆంథ్రోపిక్ టూల్స్ వల్ల ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఆంథ్రోపిక్ (Anthropic) కొత్త టూల్స్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. “గూగుల్ సెర్చ్, యూట్యూబ్ (YouTube) మాదిరిగానే ఏఐ కూడా ఓ సాధారణమైన సపోర్టింగ్ టూల్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa