అమెరికాలోని టెక్సాస్‌లో హెచ్1బి వీసాదారులైన భారతీయులపై జాతి వివక్ష వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. ఫ్రిస్కో కౌన్సిల్ సమావేశంలో కొందరు స్థానికులు, వీసా మోసాల వల్ల భారతీయుల జనాభా పెరుగుతోందని, ఇది అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటోందని ఆరోపించారు. అయితే, స్థానికంగా నివసిస్తున్న భారతీయులు ఈ ఆరోపణలను ఖండించారు. తాము కూడా వీసా మోసాలకు వ్యతిరేకమేనని, కానీ భారతీయుల వల్ల నష్టం జరుగుతుందనడం సరికాదని, ఈ ప్రాంత అభివృద్ధిలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని వారు తెలిపారు. ఫ్రిస్కో మేయర్ జెఫ్ చెనీ స్థానిక భారతీయులకు మద్దతు తెలిపారు. 2010లో టెక్సాస్‌లో భారతీయుల జనాభా 10% ఉండగా, ఇప్పుడు 30%కి పెరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa