జనసేన పార్టీకి తాను రాజీనామా చేయలేదని, కేవలం తన పదవి నుంచి మాత్రమే వైదొలిగానని బొలిశెట్టి సత్యనారాయణ స్పష్టం చేశారు. పర్యావరణానికి సంబంధించిన కేసు వేయడం వల్ల పవన్ కళ్యాణ్‌కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతోనే తాను దూరంగా ఉన్నట్లు తెలిపారు. పరిశ్రమల కాలుష్యం వల్ల పర్యావరణం తీవ్రంగా నష్టపోతోందని, ముఖ్యంగా ఉత్తర కోస్తా, కాకినాడ ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉందని, సముద్ర జీవవైవిధ్యం ధ్వంసమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉంది. ఓ వైపు నేను జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సమయంలోనే.. మరోవైపు కూటమి ప్రభుత్వం మీద కేసు కొనసాగుతుంది. పార్టీలు మారినా ప్రభుత్వాలు కొనసాగుతాయి కావున ఆ కేసు అలాగే కొనసాగుతుంది.ఈ నేపథ్యంలో నేను జనసేన పార్టీ పర్యావరణ ప్రధాన కార్యదర్శిగా ఉండటం సరికాదని.. ఆ పదవికి రాజీనామా చేశా. జనసైనికుడిగా కొనసాగుతున్నా. పార్టీకి రాజీనామా చేయలేదు.. పదవికి మాత్రమే రాజీనామా చేశా. నేను రాసిన లెటర్‌లో కూడా ఈ విషయం ఉంది. ఈ కేసు పూర్తైన తర్వాత జనసేన పార్టీలో పవన్ కళ్యా్ణ్ ఏ బాధ్యతలు అప్పగించినా పనిచేస్తా్నని అందులో ఉంది. కానీ ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేస్తున్నారు. అందుకే క్లారిటీ ఇస్తున్నా.." బొలిశెట్టి సత్యనారాయణ క్లారిటీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa