ఆంధ్రప్రదేశ్‌లోని ఆ స్కూల్లో చదివేవారికి చదవు, హాస్టల్ వసతి పూర్తిగా ఉచితం.. అది కూడా సీబీఎస్ఈ సిలబస్ ఉంటుంది. ఈ ఏకలవ్య మోడల్ స్కూల్ (ఈఎంఆర్)లో ఆరో తరగతి నుంచి ఇంటర్ (12వ తరగతి) వరకు ఉచితంగా విద్యను అందిస్తారు. ఏపీలో మొత్తం 28 ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లు ఉన్నాయి.. మొత్త 1680 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏకంగా 11 స్కూల్స్ ఉన్నాయి. ఈఎంఆర్ పాఠశాలల్లో కో-ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యాబోధన ఉంటుంది. ఈ స్కూల్స్ విశాలంగా 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశం దక్కితే.. 12వ తరగతి వరకు ఉచితంగా చదువుకోవచ్చు.. హాస్టల్ కూడా ఉచితం.
ఈ స్కూల్స్‌లో ఒక్కో క్లాస్‌కు 60 సీట్లు (30 సీట్లు బాలికలు, మరో 30 సీట్లు బాలురకు) అందుబాటులో ఉంటాయి. ఈ 60 సీట్లలో 48 సీట్లు గిరిజన విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 12 సీట్లలో పీవీటీజీలకు 3.. అనాథ పిలల్లకు 6 (ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ కులాల) సీట్లు.. దివ్యాంగులు, సంచార కుటుంబాల పిల్లలకు 3 సీట్లు కేటాయిస్తారు. ఈ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు.. ఈ నెల 28 (ఫిబ్రవరి) వరకు గడువు ఉంది. మార్చి 31కి 10 ఏళ్ల నుంచి 13 ఏళ్ల వయసు ఉన్న ఐదో తరగతి తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న విద్యార్థులు అర్హులు. ఏడాదికి ఆదాయం లక్షకు మించకూడదు, తెల్ల రేషన్ కార్డు ఉండాలి.
ఈ స్కూల్స్‌లో సీట్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.. రూ.50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు వారి పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకంతో దరఖాస్తును అప్లోడ్ చేయాలి. అలాగే విద్యార్థికి సంబంధించిన తల్లిదండ్రులు, విద్యార్థి ఆధార్.. కులం, నివాస స్థలం, రేషన్ కార్డు వంటి వివరాలు నమోదు చేయాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి ప్రింట్ తీసుకోవాలని.. దానిని తీసుకెళ్లా ఏకలవ్య స్కూల్లో అందజేయాల్సి ఉంటుంది. అనంతరం ఏప్రిల్ 4న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.. పరీక్షా కేంద్రాలను ఆయా జిల్లాల్లోని
ఈఎంఆర్, గురుకుల కళాశాల, పాఠశాలల్లో ఏర్పాటు చేస్తారు. ఈ ప్రవేశ పరీక్ష ఐదో తరగతి సిలబస్‌పై 100 మార్కులకు నిర్వహిస్తారు. మెంటల్ ఎబిలిటీ 50 మార్కులు, అర్థమేటిక్ 25 మార్కులు, తెలుగు భాషపై 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఈ ఏకలవ్య స్కూల్స్‌లో, హాస్టల్స్‌లో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి.. స్కూల్ గ్రౌండ్ కూడా ఉంటుంది. సీట్లు సాధించిన విద్యార్థులకు బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్, షూ, టై, బెడ్‌షీట్, రగ్గులు, ప్లేట్, గ్లాస్, పెట్టె ఉచితంగా అందజేస్తారు. మరిన్ని వివరాలకు దగ్గరలో ఉండే ఏకలవ్య స్కూల్స్‌లో సంప్రదించొచ్చు. స్కూల్లో కూడా దరఖాస్తు ప్రక్రియ చేస్తారు. బయట ఇంటర్నెస్ సెంటర్లలో కూడా https://aptwgurukulam.ap.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa