రాత్రివేళ తలుపు తట్టిన శబ్దం వినిపిస్తోందని, ఎవరైనా వచ్చారా? తెరిచి చూస్తే గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి, డబ్బు, బంగారంం దోచుకెళ్తున్నారట. దీంతో జనాలు రాత్రుళ్లు కర్రలు, కత్తులు పట్టుకుని ఊరిలో గస్తీ తిరుగున్నారు. ఈ వదంతులను నమ్మొద్దని పోలీసులు చెబుతున్నా.. వారు భయంతో వణికిపోతున్నారు. స్థానిక పోలీస్ అదికారులు వారికి ధైర్యం చెబుతూ.. రాత్రిళ్లు వారు కూడా కాపలా కాస్తున్నారు. సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగానే పుకార్లు ప్రచారం చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఇది పశ్చిమ్ బెంగాల్ ఝార్గ్రామ్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకుంది.
తలుపు తట్టిన శబ్దం వినిపించిన తర్వాత వాటిని తెరవగానే ఓటరు, ఆధార్ కార్డులు తగలబడిపోతున్నాయని, డబ్బు, బంగారం, నగలు దోచుకోటున్నారని పుకార్లు వ్యాపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు జంగమహల్లో భయాందోళనలు నెలకున్నాయి. స్థానికుల ప్రకారం... గత కొన్ని రోజులుగా ఝార్గ్రామ్ జిల్లాలోని మాణిక్పారా, సంక్రైల్, గోపివల్లభ్పూర్ వంటి పలు గ్రామాల్లో ఆయుధాలతో ఇళ్లలోకి చొరబడి ఇళ్లను ధ్వంసం చేసి, పత్రాలను తగులబెట్టి, డబ్బు, నగలు ఎత్తుకెళ్తున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఇలా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే దాని గురించి నిర్ధిష్ట సమాచారం లేకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు.
సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తితో అభద్రతభావం ఏర్పడి, తమ పిల్లలు మానసిక స్థిరత్వం కోల్పోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల ముందు వారు చదువుపై శ్రద్ధపెట్టలేకపోతున్నారని భయపడుతున్నారు. పుకార్లను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన పోలీసులు.. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఝర్గ్రామ్ ఎస్డిపిఓ షమీమ్ బిశ్వాస్, పోలీస్ స్టేషన్ అదికారి కౌశిక్ కుమార్లు గ్రామాలలోని పెట్రోలింగ్ సహా అనేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని, దోపిడీ జరిగిన సంఘటన తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు.
గతంలో బెంగాల్లోని బాలూరాఘాట్ బాలికల హాస్టల్లో రాత్రిపూట దెయ్యాల తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన వదంతులు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దెయ్యాల భయంతో విద్యార్థినులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో వారి భయాన్ని పోగొట్టడానికి ఉపాధ్యాయులు ప్రయత్నించి విఫలమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa