రైతుల అప్పులపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. అధిక అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాను వెల్లడించారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రైతులపై అత్యధిక అప్పుల భారం ఉందని, తెలంగాణ ఐదో స్థానంలో ఉందని తెలిపారు. జూలై 2018–జూన్ 2019 మధ్య ఏపీ రైతు సగటు అప్పు రూ.2,35,554గా, తెలంగాణ రైతు సగటు అప్పు రూ.1,52,113గా ఉన్నట్లు వివరించారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల రైతులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారని కేంద్రం స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. దేశఆర్థిక వ్యవస్థకు మూలం గ్రామీణ, వ్యవసాయ రంగాలే. 1991 తర్వాత చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు ఇండియాను ప్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మలిచినా, వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతుండటంతో దేశంలో ఉపాధి అవకాశాలు మెరుగు పడటం లేదు. మరోవైపు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రుణమాఫీ, MSP వంటి ఉపశమన చర్యలు సమస్య మూల కారణాలను పరిష్కరించలేకపోతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa