ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీ సమావేశాల వేళ పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 02:16 PM

AP: మాజీ ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం కానున్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్చించి, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో పార్టీ వైఖరిని ఖరారు చేయనున్నారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, ప్రభుత్వ నిర్ణయాలపై నిరసనల విషయంలో జగన్ కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం.మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణం, లడ్డూ వ్యవహారం, భూముల కేటాయింపు, రాష్ట్ర ఆర్దిక పరిస్థితి పైన చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సభకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లాలని భావిస్తే.. ఆ దిశగా జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే అక్కడే నిరసన వ్యక్తం చేసి బయటకు వచ్చి.. మాట్లాడాలని కొందరు సీనియర్లు తమ అభిప్రాయంగా వెల్లడిస్తున్నారు. అదే సమయంలో పార్టీ నేతల ఇళ్ల పైన దాడులు.. తిరుమల లడ్డూ వివాదం, మెడికల్ కాలేజీల పీపీపీ విధానంలో నిర్మాణం తో పాటుగా ఈ సారి ప్రతిపాదించే బడ్జెట్ పైనా చర్చ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 14న అసెంబ్లీ లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ సమయంలో సభకు వెళ్లాలని జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు పూర్తి కావటంతో.. ఇక, ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పైన ప్రతిపక్ష పార్టీగా పోరాటాలు చేయాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa