శాసనసభ, మండలి బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... అంబటి రాంబాబు, జోగిరమేష్ ఇళ్లపై దాడులు, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్‌రెడ్డిపై దాడులు కానీ, కాకాణి గోవర్థన్‌రెడ్డిపై అక్రమ కేసులు.. ఇవన్నీ కూడా లడ్డూ వ్యవహారంలో ప్రశ్నించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు చేసినవే. చివరకు చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని మనం గుళ్లలో పూజలు చేసినా, చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. ఏకంగా భౌతిక దాడులు చేస్తున్నారు. ఒక అబద్ధం సష్టించి, దానికి రెక్కలు కట్టి ప్రచారం చేయడం తొలిసారి చూస్తున్నాం. అసలు కల్తీ నెయ్యి సరఫరాకు, వైయస్ఆర్‌సీపీకి ఏమాత్రం సంబంధం లేదు. లడ్డూ వ్యవహారానికి సంబంధించిన పరిణామాలను ఒకసారి చూస్తే.. ఈ వ్యవహారంలో ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే. లెంపలేసుకోవాల్సిందీ చంద్రబాబే. ఒకసారి జరిగిన తీరు చూస్తే, రాష్ట్రంలో మార్చి 16, 2024న ఎన్నికల కోడ్ వస్తే, మే 13న, పోలింగ్ జరిగింది. మే 15న టీటీడీలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు ఓకే చేసి, ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. జూన్ 4, ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రభుత్వం మారింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే నెయ్యి సరఫరా ప్రారంభమైంది. జూన్ 12, 20, 25 జూలై 4న మొత్తం నాలుగు ట్యాంకర్లను ఏఆర్ డెయిరీ సరఫరా చేసింది. అవన్నీ ల్యాబ్ పరీక్షల్లో పాస్ అయ్యాయి. ఆ తర్వాత జూలై 6, 12 తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్లు నెయ్యి నాణ్యత పరీక్షలో ఫెయిల్ కావడంతో వెనక్కి పంపారు. జూలై 23న ల్యాబ్ రిపోర్టు రావడంతో, జూలై 25న నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించారు.
అయితే ఆ ట్యాంకర్లను జూలై 27న శ్రీకాళహస్తిలో వైష్ణవి డెయిరీకి సమీపంలో పార్క్ చేశారు. ఆ తర్వాత అవే ట్యాంకర్లు మరో డెయిరీ పేరుతో ఆగస్టు, సెప్టెంబరులో తిరిగి టీటీడీకి పంపారు. అలా వచ్చిన నెయ్యిని వాడారని, సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కూడా రాసింది. వెనక్కి పంపిన ట్యాంకర్లు తిరిగి టీటీడీలోకి వస్తే, జరిగిన పరిణామాలు, జరిగిన తేదీలు చూస్తే మొత్తం ఇవన్నీకూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగాయి. మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే కదా? నిజానికి 2014–19 మధ్య ప్రీమియర్ డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. ఆ కంపెనీ 2019లో సరఫరా ఆపేసింది. కానీ, దాన్ని కేవలం మన ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు అని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa