AP: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన దేవుడు ఎప్పటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డినే అని, ఉదయం నిద్రలేవగానే ఆయన ఫోటోకు దండం పెడతానని ఆయన అన్నారు. 20 ఏళ్లు పార్టీ కోసం పనిచేసినా ఎవరూ గుర్తించలేదని, కానీ జగన్ గారే పిలిచి పదవి ఇచ్చారని, అప్పుల్లో కూరుకుపోయిన తనను కోలుకునేలా చేశారని పేర్కొన్నారు. రాజకీయాల్లో తనది శకుని పాత్ర అని, 2014లో తనకు టికెట్ ఇచ్చి ఉంటే అప్పుడే మంత్రి అయ్యేవాడినని తెలిపారు. 2023లో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరిన జయమంగళ, 2024 నవంబర్‌లో ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, జనసేనలో చేరారు. అయితే తన రాజీనామాపై మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఆయన తాజా వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa