శ్రీశైలం ఘాట్ రోడ్డులో భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దోర్నాల వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు పక్కనే ఉన్న భారీ గుంతలోకి ఒరిగిపోవడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సకాలంలో స్పందించి బస్సులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బస్సును బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.ఏపీలోని నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. సుమారు 70 మంది ప్రయాణికులు బస్సులో ఉండగా దోర్నాల సమీప చింతల ఘాట్ రోడ్డు లో ఒక్కసారిగా అదుపుతప్పి లోయ లోకిబస్సు ఒరిగింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు అరుపులు కేకలు పెట్టారు. ఈ క్రమంలో ఘాట్ రోడ్డులోని మిగతా వాహనాల వారు వెంటనే రియాక్ట్ అయి పక్కకు ఒరిగిపోయిన బస్సు నుంచి అద్దాలు పగలకొట్టి ప్రయాణికుల్ని బైటకు తీశారు.మరి కొంత మంది బస్సు అద్దాల్ని పగలకొట్టుకుని బైటకు వచ్చారు. ఈ ఘటనతో ఆ ప్రాంత మంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనేక మందిఈ ఘటనలో గాయపడ్డారు. కొంత మంది షాక్ లో ఉండిపోయారు. ఒక్కసారిగా గుండె ఆగినంత పనైందని పలువురు ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మల్లన్న దయవల్లే బతికి బట్టకట్టామని భావొద్వేగంకు గురౌతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa