విదేశీ గడ్డపై ఉన్నత చదువులు చదివి, గొప్ప స్థాయికి చేరుకోవాలనుకున్న ఒక భారతీయ ఆణిముత్యం అర్థాంతరంగా రాలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కలేలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్న 22 ఏళ్ల కన్నడ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆరు రోజుల గాలింపు అనంతరం ఫిబ్రవరి 14న లేక్ అంజా సమీపంలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా ఆయన స్నేహితుడు ఇతని మరణానికి సంబంధించిన ఓ సంచలన పోస్టు పెట్టాడు. అందులో 15 రోజుల ముందు నుంచే సాకేత్ వింతగా ప్రవర్తించినట్లు చెప్పుకొచ్చారు.
సాకేత్ మనసులో ఏదో సంఘర్షణ..!
కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య చాలా తెలివైనవాడు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన సాకేత్.. హైపర్‌లూప్ టెక్నాలజీలో 'మైక్రోచానల్ కూలింగ్ సిస్టమ్' కని పెట్టిన ఆరుగురు మేధావులలో ఒకడు. ఆవిష్కర్తగా పేటెంట్ హక్కులు కూడా పొందిన ఈ యువ ఇంజనీర్.. బర్కలేలో బయో మాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అంతటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే అతడి రూమ్‌మేట్ బనీత్ సింగ్.. సోషల్ మీడియా వేదికగా సాకేత్ ఆత్మహత్య చేసున్నట్లుగా తాను కూడా భావిస్తున్నానన్నాడు. అంతేకాకుండా అతడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు, పదిహేను రోజులుగా అతడు తీరుని వివరించాడు.
రూమ్‌మేట్ వెల్లడించిన చేదు నిజాలివే..!
సాకేత్ మరణానికి రెండు వారాల ముందు నుంచే అతని ప్రవర్తనలో వింత మార్పులు వచ్చాయని బనీత్ సింగ్ పేర్కొన్నాడు. గత 15 రోజులుగా సాకేత్ సరిగా నిద్రపోవడం లేదని.. కేవలం చిప్స్, కుకీస్ తింటూ గడిపాడని తెలిపాడు. జనవరి 21న తనను 'లేక్ అంజా'కు రావాలని సాకేత్ ఆహ్వానించాడని.. కానీ తాను బద్ధకించి వెళ్లలేదని, అదే చోట సాకేత్ ప్రాణాలు తీసుకుంటాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఒకరోజు క్లాసు నుంచి ఎర్రటి బాత్‌రోబ్ వేసుకుని వచ్చిన సాకేత్.. "నాకిక దేని మీద ఆసక్తి లేదు. ప్రపంచం ఏమనుకున్నా నాకు అనవసరం" అని అన్నాడని, అప్పట్లో తాను దానిని జోక్ అని అనుకున్నానని బనీత్ వాపోయాడు.
అసలేం జరిగిందంటే..?
ఫిబ్రవరి 9న సాకేత్ అదృశ్యం అయ్యాడు. క్యాంపస్‌కు కిలోమీటరు దూరంలో అతని బ్యాగ్, పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్ లభించాయి. దీంతో కాలిఫోర్నియా పోలీసులు, భారత రాయబార కార్యాలయం సమన్వయంతో గాలింపు చేపట్టారు. చివరికి వాలెంటైన్స్ డే రోజున సాకేత్ మృతదేహం లభ్యమైంది. సాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ సాకేత్ కుటుంబానికి సంతాపం ప్రకటించడమే కాకుండా, మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa