శ్రీలంకతో జరిగిన కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో ఆ జట్టు సెమీ ఫైనల్ అవకాశాలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. తమ భవిష్యత్తు ఇప్పుడు దేవుడి చేతిలో ఉందని, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి రావడం దురదృష్టకరమని ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమితో ఆస్ట్రేలియా శిబిరంలో తీవ్ర నిరాశ అలముకుంది.మ్యాచ్ అనంతరం మార్ష్ మాట్లాడుతూ "ఆట తొలి అర్ధభాగంలో మేం మెరుగైన స్థితిలోనే ఉన్నాం. 182 పరుగులు మంచి స్కోరే అయినప్పటికీ, మా ఆరంభానికి అది సరిపోదు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా చివరి ఓవర్లలో శ్రీలంక బౌలర్లు అద్భుతంగా పుంజుకుని మమ్మల్ని కట్టడి చేశారు" అని ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa