ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో లైంగిక వేధింపుల కేసులో భారతీయుడు అరెస్ట్

international |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 01:28 PM

పిల్లలపై లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి అమెరికాలో ఒక భారతీయుడుని అరెస్ట్ చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లి అనే ఈ నిందితుడు సరైన పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించాడని అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. నిందితుడిని న్యూజెర్సీలో అరెస్టు చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రకటన విడుదల చేశారు.13 సంవత్సరాల లోపు మైనర్లపై లైంగిక నేరాలకు పాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa