రాష్ట్రంలో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హామీ మేరకు మరో నోటిఫికేషన్‌కు విద్యాశాఖ ముహూర్తం ఖరారు చేసింది. రాబోయే ఉగాది పండగ సందర్భంగా ఈ ప్రకటన విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.పాఠశాల విద్యాశాఖ సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్, సంక్షేమ పాఠశాలలు: 1,200 పోస్టులు.
ప్రభుత్వ, పంచాయతీరాజ్, పురపాలక పాఠశాలలు: 1,700 పోస్టులు.
స్పెషల్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక విద్య) పోస్టులు: 700 వరకు ఉన్నాయి. గత ఏడాది ఏప్రిల్‌లో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, అర్హులైన అభ్యర్థులు లేక మిగిలిపోయిన పోస్టులను కూడా ఇందులో కలిపే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa