ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసు జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 05:32 PM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం సేకరించే నెయ్యి టెండర్ల విషయంలో అవకతవకలు జరిగాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపాయి. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన ఇందాపూర్ డెయిరీకి అధిక ధరలకు కాంట్రాక్టులు కట్టబెట్టారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ ఆరోపణలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), హెరిటేజ్ ఫుడ్స్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. తప్పుడు ఆరోపణలు చేశారంటూ బొత్స సత్యనారాయణకు హెరిటేజ్ ఫుడ్స్ లీగల్ నోటీసు జారీ చేసింది.ఈ వివాదంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందిస్తూ, నెయ్యి సేకరణ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. 2024 తర్వాత భక్తుల నుంచి వచ్చిన సూచనల మేరకు నెయ్యి నాణ్యతను పెంచేందుకు పలు సంస్కరణలు చేపట్టామని తెలిపారు. గతంలో 1500 కిలోమీటర్ల దూరం నుంచి నెయ్యి సేకరించేవారని, నాణ్యతను దృష్టిలో ఉంచుకుని ఆ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గించామని వివరించారు. ట్యాంకర్లకు జీపీఎస్ లాకింగ్ వ్యవస్థ, MRL స్కోర్‌బోర్డు వంటి కఠినమైన నాణ్యతా ప్రమాణాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa