ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు బిగ్ అలర్ట్. హై-శాలరీ ఉన్న కొంత మంది ఉద్యోగులకు ఐటీ శాఖ నుంచి నడ్జ్ నోటీసులు అందుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో వెల్లడించని ఆదాయాలు, క్రిప్టో లాభాలు, ఈఎస్ఓపీ లాభాలు, విదేశీ ఆస్తులు, ఆదాయాల వంటి అంశాల్లో లోపాలను సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నోటీసులను ఐటీ శాఖ జారీ చేస్తోంది. ఇది ఒక మంచి అవకాశంగా చూడాలని, ఏవైనా ఆస్తుల వివరాలు మర్చిపోయి ఉంటే సరిచేసుకుని స్వచ్ఛందంగా ట్యాక్సులు చెల్లించాలని సూచిస్తోంది. కఠిన చర్యలకు ఎదుర్కోక ముందే స్వచ్ఛందంగా తమ పొరపాట్లు, తప్పులను సరిచేసుకునేందుకు ఇది చివరి అవకాశమని అధికారులు హెచ్చరించారు.
ఒకే రాజకీయ పార్టీకి లేదా వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చేందుకు కొందరు ట్యాక్స్ పేయర్లు ఒకే చార్టర్డ్ అకౌంటెంట్ సేవలు ఉపయోగిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత సీఏలపై సైతం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి మల్టీనేషనల్ కంపెనీల సీఈఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు సహా ఉన్నతాధికారులకు ఈ నోటీసులు పంపించినట్లు తెలిపింది. భారీ పెనాల్టీలు విధించే ముందు తమ ఐటీఆర్‌లోని లోపాలను సరిచేసుకోవాలని కోరింది. అధిక ఆదాయ వర్గాల ఐటీ రిటర్నులను సమీక్షించగా ఈ ఆదాయాల్లో వ్యత్యాసాలు గుర్తించినట్లు ఐటీ శాఖ తెలిపింది. గైడ్ అండ్ ఎనేబుల్ (నడ్జ్) కార్యక్రమంలో భాగంగా సవరించిన ఐటీఆర్ ఫైల్ చేయాలని సూచిస్తోంది.
నడ్జ్ నోటీసు అంటే డీఐఎన్ నంబర్‌తో వచ్చే అధికారిక పన్ను నోటీసు కాదని ట్యాక్స్ పేయర్లు గుర్తించాలి. కేవలం తమ పొరపాట్లను సరిచేసుకునేందుకు ఇచ్చే ముందస్తు హెచ్చరిక. ఐటీఆర్‌లో ప్రకటించిన ఆదాయం, ఆస్తులు సరైనవేనవే అయితే డీఐఎన్ నంబర్‌తో అధికారిక ఐటీ నోటీసు వచ్చే వరకు ఎలాంటి ఆందోళన అవసరం లేదని పన్ను నిపుణులు చెబుతున్నారు. నడ్జ్ నోటీసులు అందిన ట్యాక్స్ పేయర్లు తమ ఐటీ రిటర్నులను మరోసారి సమక్షించుకోవాలి. పూర్తి లావాదేవీల వివరాలు సేకరించాలి. అవసరమైతే సెక్షన్ 139 (8ఏ) కింద అప్‌డేటెట్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. వడ్డీతో పాటు అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa