ఫ్రిజ్‌ని వాడడం చాలా కామన్ అయిపోయింది. చిన్న చిన్న పదార్థాల నుండి ఎన్నో పదార్థాల వరకూ అన్నింటినీ అందులో పెట్టేస్తాం. అయితే, మనం దీనిని రెగ్యులర్‌గా వాడినప్పటికీ అంతే రెగ్యులర్‌గా క్లీన్ చేయడం కూడా ముఖ్యం. లేదంటే అందులో చిన్న చిన్న క్రిమీకీటకాలు పెరిగిపోతాయి. ఇవి స్టోర్ చేసిన ఫుడ్స్‌పై కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి.
అలా కాకుండా ఉండేందుకు ఫ్రిజ్‌ని మరకలు లేకుండా, మురికి మొత్తం పోయేలా ఉండేందుకు ఎలా క్లీన్ చేయాలి. ఏయే పదార్థాలు వాడితే మరకలు పోవడమే కాకుండా అందులోని జిడ్డు కూడా పోతుందో తెలుసుకోండి. వాటి వల్ల చక్కగా నీట్‌గా మారడమే కాకుండా మనం వాడడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేయాలి. దీనికోసం ఏమేం వాడొచ్చో చూద్దాం.
ముందుగా అన్నీ వస్తువుల్ని తీసేయడం
ఫ్రిజ్‌ని క్లీన్ చేయడానికి ముందుగా అందులో ఉన్న ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా తీసేయండి. మనకి తెలియకుండా ఫ్రిజ్‌ని మనం అక్షయపాత్రలా వాడుతుంటాం. కొందరైతే 2, 3 రోజులైనా అందులో పదార్థాలు పెట్టి మర్చిపోతుంటారు. అలాంటి పదార్థాలన్నీ ముందుగా తీసేయండి. వీటి వల్ల ఫ్రిజ్‌ని క్లీన్ చేయడం ఈజీ అవుతుంది.
పార్ట్స్ కూడా తీసేయడం
ఫ్రిజ్‌లో కొన్ని ఈజీగా తీసి ఫిక్స్ చేయొచ్చు. మీరు డీప్‌గా క్లీన్ చేయాలంటే వాటిని రిమూవ్ చేయండి. అలా చేయడం వల్ల క్లీనింగ్ మరింత ఈజీ అవుతుంది. వాటిని మనం బయటికి తీసి వాటిని, ఫ్రిజ్‌లోపల కూడా క్లీన్ చేయొచ్చు. మరకలు ఉంటే క్లీన్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అయితే, ఆ వస్తువుల్ని తీసేయడంజాగ్రత్తగా తీసేయాలి.
పొడిగుడ్డతో తుడవడం
అన్నింటినీ తీసేశాక లోపల మనకి చాలా డస్ట్, ఫుడ్ తాలుకూ, పదార్థాల తాలుకూ వ్యర్థాలు ఉంటాయి. వాటన్నింటినీ ముందుగా పొడిగుడ్డతో తుడవండి. వీలైతే ఏవైనా మరకలు ఉంటే వాటిని కూడా తుడవండి. ఇలా తుడవడం వల్ల మరకలు పోవడమే కాకుండా, వ్యర్థాలన్నీ కూడా వెళ్లిపోతాయి. ఇక ఇప్పుడు అసలు టాస్క్.
క్లీనింగ్ మిశ్రమం తయారు చేయడం
కొద్దిగా నీరు
1 టేబుల్ స్పూన్ డిష్ వాష్
1 టేబుల్ స్పూన్ వెనిగర్
స్ప్రే బాటిల్
పదార్థాలన్నింటినీ స్ప్రే బాటిల్‌లో వేసి బాగా షేక్ చేయండి. ఈ స్ప్రేని మనం ఫ్రిజ్‌లోని ప్రతి మూల స్ప్రే చేయండి. తర్వాత ఓ పొడిగుడ్డ తీసుకుని దాన్నంతా చక్కగా తుడవండి. చాలా వరకూ మరకలు, వ్యార్థాలన్నీ పోతాయి.
కొన్ని మరకలు ఉంటే
ఇంకా కొన్ని మరకలు కొన్ని ఉంటే వాటిని తగ్గించేందుకు నిమ్మరసం, బేకింగ్ సోడాలని కలిపి ఓ పేస్టులా తయారు చేయండి. దీనిని మరకలు ఉన్న చోట అప్లై చేసి ఆ తర్వాత కాసేపు ఉంచండి. మనకి డోర్ దగ్గర రబ్బర్ ఉంటుంది. అక్కడ కూడా అప్లై చేయొచ్చు మరకలు ఉంటే. వీటిని క్లీన్ చేయడానికి బ్రష్‌ని వాడండి. బ్రష్‌తో రాసి ఆపై స్ప్రే చేసి మరోసారి గుడ్డతో తుడవండి. ఇలా కనీసం నెలకోసారైనా చేస్తే మీ ఫ్రిజ్ స్టెయిన్ ఫ్రీగా ఉండడమే కాకుండా, నీట్‌గా మారుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa