‘మోసానికి షర్ట్, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబు.. అబద్ధానికి రెక్కలు తొడిగితే అవి చంద్రబాబు మాటలు’.. అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి తేల్చి చెప్పారు. చంద్రబాబు పాలనలో ప్రతి బడ్జెట్లోనూ ప్రజలకు వంచన, మోసమే అని, ఈ ఏడాది బడ్జెట్లోనూ అన్నీ తప్పుడు గణాంకాలు, మొత్తం కాకి లెక్కలు. పూర్తిగా అవాస్తవాలే అని శ్రీ వైయస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబుది ఆర్థిక అస్తవ్యస్త నిర్వహణ అన్న ఆయన, రాష్ట్ర అప్పులపై పదే పదే అవే అబద్ధాలు చెబుతున్నారని, ఆదాయంలో దారుణ స్థితిలో మన రాష్ట్రం ఉందని, ‘కాగ్’ రిపోర్ట్ ప్రకారం దేశంలో 22వ స్థానం నిల్చిందని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు.ఎన్నికల ముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇంటింటికీ బాండ్లు పంపి పచ్చి మోసం చేశారని, వాటిలో ఏదీ అమలు చేయకుండా వంచన, దగా చేశారని, చివరకు ఉద్యోగులకు కూడా భారీ మోసం చేశారని, రెండేళ్లుగా ఉద్యోగుల జీతాలు పెరగలేదని, వారికి ఐఆర్ ఇవ్వలేదని, పీఆర్సీ ప్రస్తావనే లేదని గుర్తు చేశారు. ‘చంద్రబాబు హ్యాబిట్యువల్ అఫెండర్’ అన్న శ్రీ వైయస్ జగన్, ఆయనకు మోసాలు కొత్త కానే కాదని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తేల్చి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa