ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్బీఐ స్పెషల్ స్కీమ్.. దీంట్లోనే అధిక వడ్డీ

business |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 11:08 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో రేట్లను గతేడాది భారీగా తగ్గించగా.. ఇదే సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు భారీగా తగ్గాయని చెప్పొచ్చు. ప్రభుత్వ బ్యాంకుల్లో చూస్తే ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిలకు కూడా పడిపోయాయి. అయినప్పటికీ ఇక్కడ కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు.. స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ లాంఛ్ చేస్తున్నాయి. వీటిపైనే అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి కూడా స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయి. ఇక్కడ 444 రోజుల స్పెషల్ టెన్యూర్‌తో ఎస్బీఐ అమృత్ వృష్టి పథకం ఉండగా.. ఈ బ్యాంకులో అధిక వడ్డీ రేటు ఈ స్పెషల్ టెన్యూర్‌పైనే ఉంది.


>> ఎస్బీఐ గతంలో అమృత్ కలశ్ స్కీంను 400 రోజుల వ్యవధితో తీసుకురాగా.. దానిపైనే అధిక వడ్డీ ఉండేది. తర్వాత ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించిన క్రమంలో బ్యాంక్ ఈ స్కీంను నిలిపివేసింది. తర్వాత 444 రోజుల వ్యవధితో అమృత్ వృష్టి పథకాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ కూడా ప్రారంభంలో సాధారణ ప్రజలకు ఏకంగా 7.25 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.75 శాతం వడ్డీ ఆఫర్ చేయగా.. తర్వాత 2 సార్లు వడ్డీ రేట్లను తగ్గించింది.


ప్రస్తుతం ఈ పథకంలో సాధారణ ప్రజలకు అధికంగా 6.45 శాతం, సీనియర్ సిటిజెన్లకు మరో 50 బేసిస్ పాయింట్లు అధికంగా అంటే 6.95 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ఇప్పటికీ అన్ని టెన్యూర్లలో చూస్తే ఈ స్పెషల్ స్కీమ్ వడ్డీ రేటే ఎక్కువగా ఉంది. మిగతా టెన్యూర్లపై సాధారణ ప్రజలకు వారం నుంచి పదేళ్ల వరకు ఎఫ్‌‌డీపై కనీసం 3.05 శాతం నుంచి గరిష్ఠంగా 6.40 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా.. సీనియర్ సిటిజెన్లకు 3.55 శాతం నుంచి 6.95 శాతంగా ఉంది.


>> అమృత్ వృష్టి పథకంలో కనీసం రూ. 1000 నుంచి డిపాజిట్ చేయొచ్చు. గరిష్ఠంగా రూ. 3 కోట్ల వరకు ఎఫ్‌డీ చేసేందుకు వీలుంటుంది. ఇప్పుడు రూ. 5 లక్షలు ఒకేసారి జమ చేస్తే మెచ్యూరిటీకి ఎంతొస్తుందో తెలుసుకుందాం. 5 లక్షలు జమ చేస్తే.. సాధారణ ప్రజలకు 6.45 శాతం వడ్డీ రేటుతో 444 రోజులకు రూ. 33,038 వడ్డీ వస్తుంది. మొత్తం బ్యాలెన్స్ రూ. 5,33,038 గా ఉంటుంది. సీనియర్ సిటిజెన్లకు 6.95 శాతం వడ్డీ రేటుతో చూస్తే 444 రోజులకు రూ. 35,666 వడ్డీ వస్తుంది. ఇక్కడ మొత్తం బ్యాలెన్స్ రూ. 5,35,666 అవుతుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa