చాలా మందికి పెట్టుబడులు పెట్టాలని ఉన్నప్పటికీ.. ఎక్కడ ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలో సరిగా తెలిసుండదు. దీనిపై అవగాహన ఉండకపోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉన్నప్పటికీ ఇక్కడ దీర్ఘకాలంలోనే మంచి రాబడి అవకాశాలు ఉన్నప్పటికీ.. రిస్క్ ఎక్కువగా ఉంటుందని భయపడుతుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా సంప్రదాయ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ పథకాలు వంటివి ఉన్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో నిర్దిష్ట కాల వ్యవధికి వడ్డీ రేట్లను బట్టి గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. అయితే ఇటీవల ఆర్బీఐ రెపో రేటును భారీగా తగ్గించిన తర్వాత ఇటీవల స్థిరంగా ఉంచింది. అయినా చాలా బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లను తగ్గించాయని చెప్పొచ్చు. దీంతో గతంతో పోలిస్తే రాబడి తగ్గింది. ఇటీవల ఫిబ్రవరి సమీక్షలో మాత్రం ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించకుండా స్థిరంగానే ఉంచింది. ఈ క్రమంలో మనం దేశంలోని ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు దేంట్లో అధిక వడ్డీ రేట్లు ఏ టెన్యూర్‌పై ఉన్నాయనేది చూద్దాం.
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులే కాస్త అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయని చెప్పొచ్చు. వీటిల్లో సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా ఐదేళ్ల టెన్యూర్ డిపాజిట్‌పై 7.90 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో అధిక వడ్డీ రేటు 7.77 శాతం 3-5 ఏళ్ల వ్యవధిపై ఆఫర్ చేస్తోంది. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 18 నెలల 1 రోజు నుంచి 2 రోజుల వరకు డిపాజిట్‌పై అత్యధికంగా 7.75 శాతం వడ్డీ ఉంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 444 రోజుల వ్యవధికి 7.60 శాతం వడ్డీ అందిస్తోంది. ఇవన్నీ సాధారణ ప్రజలకు కాగా.. సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ వస్తుంది.
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియాలో అత్యధికంగా 7.30 శాతం వడ్డీ రేటు 18 నెలల నుంచి రెండేళ్ల వ్యవధి డిపాజిట్లకు ఆఫర్ చేస్తోంది. బంధన్ బ్యాంకులో 2-3 ఏళ్ల వ్యవధిపై 7.20 శాతం, ఆర్‌బీఎల్ బ్యాంకులో 18 నెలల నుంచి 3 ఏళ్ల వ్యవధిపై 7.20 శాతం వడ్డీ రేటు ఉంది. యెస్ బ్యాంకులో 18 నెలల నుంచి ఐదేళ్లకు 7 శాతం వడ్డీ రేటు ఉంది. ప్రముఖ బ్యాంకుల్లో చూస్తే ఐసీఐసీఐ బ్యాంకులో 3 ఏళ్ల నుంచి పదేళ్ల డిపాజిట్‌పై 6.50 శాతం వడ్డీ రేటు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో అత్యధికంగా 6.45 శాతం 18 నెలల నుంచి 3 ఏళ్ల వ్యవధికి ఉంది. యాక్సిస్ బ్యాంకులో 15 నెలల నుంచి 10 ఏళ్ల డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.45 శాతంగా ఉంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అధికంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా.. 450 రోజుల స్పెషల్ డిపాజిట్‌పై అధికంగా 6.70 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 444 రోజుల అమృత్ వృష్టి స్పెషల్ స్కీంపై వడ్డీ రేటు 6.45 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదే టెన్యూర్‌పై వరుసగా 6.45 శాతం, 6.60 శాతం వడ్డీ అందిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో 390 రోజుల డిపాజిట్‌పై 6.40 శాతం వడ్డీ రేటు అత్యధికం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa