భారతదేశం 'ఆపరేషన్ సింధూర్' ద్వారా పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలను ఛేదించిన తర్వాత, పాకిస్తాన్ ఆగస్టు 13, 2025న చైనా సాంకేతిక సహకారంతో యాంటీ-రాకెట్ ఫోర్స్ కమాండ్‌ను ఏర్పాటు చేసుకుంది. మే 10న జరిగిన ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్ కిరాణా హిల్స్, సర్గోధా, నూర్ఖాన్ ఎయిర్‌బేస్‌లు ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ తన అణ్వాయుధాలకు నష్టం లేదని చెప్పినా, భారత మిసైళ్లు, రాకెట్లు తట్టుకోలేకపోవడం స్పష్టమైంది. ఈ కొత్త రక్షణ వ్యూహం భారత లాంగ్–రేంజ్ మిసైళ్లను ఎదుర్కోవడానికి రూపొందించబడింది. అయితే భారత సామర్థ్యం ముందు ఇది ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa