ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా దగ్గర ప్లాన్ బి ఉంది.. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ రియాక్షన్

international |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 07:48 PM

సుంకాల ఉత్తర్వులను రద్దుచేస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన.. తన వద్ద ప్లాన్ బి ఉందని వ్యాఖ్యానించారు. గవర్నర్లతో జరిగిన ప్రైవేట్ సమావేశంలో సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం ‘అవమానకరం’ అని, ఆ జడ్జీలను చూసి సిగ్గుపడుతున్నా అని ట్రంప్ అభివర్ణించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సుంకాలపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన సమయంలో ట్రంప్ రెండు పార్టీలకు చెందిన దాదాపు రెండు డజన్ల మంది గవర్నర్లతో ప్రైవేట్‌గా సమావేశమయ్యారు


ఈ కేసు గురించి ట్రంప్ తీవ్రంగా స్పందిస్తూ.. అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన కేసులలో ఒకటిగా అభివర్ణించారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అది దేశానికి ఆర్థికంగా దెబ్బ అవుతుందని అన్నారు. కానీ చట్టపరమైన వ్యతిరేక రాజకీయ నిర్ణయాన్ని పక్కనెబెట్టింది. పన్నులు, సుంకాలను విధించే అధికారం కార్యనిర్వాహక శాఖకు రాజ్యాంగ నిర్మాతలు కట్టబెట్టలేదని తేల్చిచెప్పింది. మరోవైపు, ట్రంప్ నిర్ణయాన్ని సమర్దిస్తూ తీర్పు రాసిన ముగ్గురు న్యాయమూర్తులు.. ఇందులో మంచి చెడ్డలు ఎలా ఉన్నప్పటికీ ఆయన నిర్ణయం చట్టబద్దమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై విధించిన సుంకాలను 18 శాతానికి తగ్గించిన విషయాన్ని తీర్పులో ప్రస్తావించారు.


ఇక, తీర్పుపై తక్షణమే వైట్‌హౌస్ స్పందించలేదు .టారిఫ్‌ల విధానం కింద ఇప్పటికే వసూలు చేసిన బిలియన్ల డాలర్లను కంపెనీలు వాపసు పొందేందుకు అర్హత ఉందా? లేదా? అనే విషయాన్ని కూడా కోర్టు స్పష్టం చేయలేదు. రిటైల్ దిగ్గజం కాస్ట్‌కోతో సహా అనేక సంస్థలు తిరిగి చెల్లింపు కోరుతూ దిగువ కోర్టులను ఆశ్రయించాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉంటుందని కవనాగ్ హెచ్చరించారు.


కాంగ్రెస్ అనుమతి లేకుండానే విధానపరమైన చర్యలు తీసుకోవడానికి అధ్యక్షుడికి అధికారం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్, సంప్రదాయవాదులు జస్టిస్ నీల్ గోర్సుచ్, జస్టిస్ అమీ కోనీ బారెట్ మరో ముగ్గురు లిబరల్ న్యాయవాదులు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘‘ఏకపక్షంగా టారిఫ్‌లను విధించే అసాధారణ అధికారాన్ని ట్రంప్ వినియోగించారు’ అని చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ వ్యాఖ్యానించారు.


సుప్రీంకోర్టు తాాజా తీర్పు నెపథ్యంలో అమెరికాతో పలు దేశాలు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు బుట్టదాఖలయ్యే అవకాశం ఉంది. భారత్- అమెరికా మధ్య కూడా ఇటీవల వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని భారత్‌ సమీక్షించే అవకాశం లేకపోలేదు. అలాగే, సుంకాలు రద్దుకావడంతో సగానికిపైగా భారతీయ ఎగుమతులపై 18 శాతం అదనపు సుంకాల భారం తగ్గనుంది.


అయితే, ఈ తరహా టారీఫ్‌లను ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఆర్థిక అధికారాల చట్టం’ లోని సెక్షన్‌ 301, 232 కింద విధించేందుకు ట్రంప్ ప్రయత్నించవచ్చు. కానీ, దీనికి మళ్లీ ప్రజామోదం పొందాల్సి ఉంటుంది. దీనిని అడ్డుపెట్టుకుని ట్రంప్.. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందనే నెపంతో భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలను ట్రంప్ విధించారు. ఇక, సుంకాలను రద్దుచేయడంతో పలు దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలను తిరిగి చెల్లించాల్సి వస్తే అమెరికాకు పెను భారమే అవుతుంది. గతేడాది డిసెంబరు వరకూ అమెరికా ఖజానాకు సుంకాల కింద 13,300 కోట్ల డాలర్లు జమైనట్టు అంచనా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa