ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓర్వకల్లు ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన గౌరు చరితారెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 08:03 PM

శనివారం ఓర్వకల్లు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు, సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని డాక్టర్లు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆరోగ్య సేవలను మరింత సమర్ధవంతంగా అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టాలని ఆమె ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa