దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి రాజ్యాంగ పదవి ఇవ్వడం ముఖ్యమంత్రి జగన్ నేర ప్రవృత్తికి నిదర్శనమని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2022 మే 19న జరిగిన ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిందని, అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్యకు పాల్పడ్డారని తెలిసి ప్రజలు షాక్‌కు గురయ్యారని పేర్కొన్నారు. కేసులో ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు తీసుకోలేదని, పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ఆరోపించారు. టీడీపీ పోరాటంతోనే కేసు పురోగమించి శిక్ష పడిందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa