ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నో సెక్యూరిటీ, నో షూరిటీ,,,ఒక్క మిస్డ్ కాల్‌తో రూ.50 లక్షల వరకు లోన్

business |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 11:22 PM

మీ ఇంట్లో పెళ్లి ఉందా లేదా ఏదైనా వెకేషన్ ప్లాన్ చేస్తున్నారా లేదా ఏదైనా ఆర్థిక అత్యవసరం ఏర్పడిందా లేదా ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు చేసే ప్లాన్లో ఉన్నారా? అయితే ఈ కథనం మీకోసమే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మీ లాంటి వారి అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చేందుకు సరికొత్త పర్సనల్ లోన్ స్కీమ్ తీసుకొచ్చింది. చాలా తక్కువ వడ్డీ రేటుతోనే వేగంగా లోన్ అందిస్తోంది. బ్యాంకుకు వెళ్లకుండానే లోన్ మంజూరు చేస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఎస్‌బీఐ కస్టమర్ కేర్ నంబర్‌కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత బ్యాంక్ అధికారులే ఫోన్ చేసి అన్ని వివరాలు సేకరించి చాలా వేగంగా మీకు లోన్ వచ్చేలా చూస్తారు. ఈ కొత్త పర్సనల్ లోన్ స్కీమ్ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి అమలులోకి తీసుకొచ్చింది.


ఈ కొత్త స్కీమ్ ద్వారా కనీసం రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ.50 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. ప్రస్తుతం 10.05 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభమవుతున్నాయని ఎస్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. మార్కెట్‌లోని ఇతర బ్యాంకులతో పోలిస్తే చాలా తక్కువ వడ్డీ రేటుగా చెప్పవచ్చు. ఈ లోన్ పొందడానికి ఆస్తులు తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ఏ షురిటీ అక్కర్లేదని బ్యాంక్ తెలిపింది. ఒక లోన్ రన్ తీసుకుని ఈఎంఐ చెల్లిస్తున్నప్పటికీ ఏదైనా అత్యవసరమైతే 2వసారి కూడా లోన్ తీసుకునే వెసులుబాటు ఉన్నట్లు బ్యాంక్ తెలిపింది.


లోన్ పొందేందుకు అర్హతలు


వేతన జీవుల కోసం ఈ కొత్త లోన్ పథకాన్ని తీసుకొచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగంలో ఉన్న సిబ్బంది, కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వారు ఈ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనీసం 6 నెలల సర్వీస్ ఉండాలి. అదే ప్రైవేట్ ఉద్యోగులు అయితే ఏడాది సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ లేదా రక్షణ రంగ ఉద్యోగులు అయితే నెలకు రూ.20 వేలు, ప్రైవేట్ ఉద్యోగులు అయితే నెలకు రూ.25 వేల నికర ఆదాయం వస్తూ ఉండాలి.


కావాల్సిన డాక్యుమెంట్లు


ఈ పథకం ద్వారా తక్కువ డాక్యుమెంట్లతోనే వేగంగా లోన్ మంజూరు చేస్తున్నారు. పాన్ కార్డు, ఆధార్ లేదా ఓటర్ ఐడీ కారు, గత 6 నెలల శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటివి ఇస్తే సరిపోతుంది. ఐటీ రిటర్న్స్ లేదా ఫామ్ 16 ఇవ్వాల్సి రావచ్చు. డిజిటల్ పద్ధతిలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. తద్వారా మీరు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.


రక్షణ రంగ ఉద్యోగులకు, ప్లాటినం లేదా రోడియం శాలరీ ప్యాకేజీ ఉన్న ఉద్యోగులకు అయితే ప్రాసెసింగ్ ఫీజు ఉండదని బ్యాంక్ తెలిపింది. 800 కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ రుణాన్ని 6 నెలల నుంచి 7 ఏళ్ల టెన్యూర్ ద్వారా చెల్లించవచ్చు. లోన్ కావాలనుకునే వారు 7208933142 నంబర్‌కు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. లేదంటే 1800 1234 నంబర్‌కు ఫోన్ చేస్తే బ్యాంక్ సిబ్బంది మీకు తిరిగి కాల్ చేసి వివరాలు అందిస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా కావాల్సిన సమాచారం పొందొచ్చు. లేదా https://sbi.bank.in/web/personal-banking/loans/personal-loans/sbi-personal-loan వెబ్‌సైట్లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు. తద్వారా తక్కువ వడ్డీకే లోన్ లభిస్తుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa