ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ ఆఫర్ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఒకవేళ టీమిండియా ఫైనల్ చేరితే కచ్చితంగా మ్యాచ్ చూడటానికి వెళ్తానని నారా లోకేష్ తెలిపారు. అలాగే టీ20 ప్రపంచకప్ ఫైనల్ చూడటానికి వైఎస్ జగన్ వస్తానంటే.. ఆయనకు కూడా టికెట్ తీసుకుంటానంటూ కౌంటర్ వేశారు. వస్తానంటే జగన్‌ను కూడా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు తీసుకెళ్తానంటూ నారా లోకేష్ సెటైర్లు గుప్పించారు. ఓ చిట్ చాట్ సందర్భంగా నారా లోకేష్ సెటైర్లు వేశారు. తనకు దేశభక్తి ఉందని.. అలాగే క్రికెట్ అంటే ఇష్టం కావటంతో తప్పకుండా వెళ్తానని అన్నారు.
అయితే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబోలో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ చూడటానికి ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ కూడా కొలంబోలోని ప్రేమదాస స్టేడియానికి వెళ్లి మ్యాచ్ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 16వ తేదీన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమరావతికి వచ్చారు. దీంతో రాత్రికి రాత్రే గన్నవరం చేరుకున్న నారా లోకేష్.. బిల్ గేట్స్‌కు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. అయితే నారా లోకేష్ విదేశీ పర్యటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోపించింది.
ఇక వైఎస్ జగన్ మాట్లాడుతూ క్రికెట్ మ్యాచ్ చూడటానికి కొలంబో గ్రౌండ్ వరకూ వెళ్లడమెందుకు.. చూడాలనుకుంటే టీవీలో సరిపోతుందంటూ సెటైర్లు వేశారు. అయితే వీటిపై నారా లోకేష్ స్పందించారు. మ్యాచ్ టికెట్లు నావే.. ఫ్లైట్ టికెట్లు నావే.. నా సొంతడబ్బుతో మ్యాచ్ చూడటానికి వెళ్లా.. నీ దుడ్లు ఏమైనా పెట్టానా అంటూ నారా లోకేష్ సెటైరికల్ పోస్టు చేశారు.
దీంతో సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ట్వీట్ల వార్ జరిగింది. అయితే తాజాగా విలేకర్లతో చిట్ చాట్ సందర్భంగా నారా లోకేష్.. వైఎస్ జగన్‌ను టీ20 ప్రపంచకప్ ఫైనల్ చూద్దామని ఆహ్వానించారు. భారత జట్టు ఫైనల్ చేరితే.. జగన్‌కు కూడా టికెట్ తీసి, ఫైనల్ మ్యాచ్‌కు తీసుకెళ్తానంటూ నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa