ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల్లోకి ఫేక్ న్యూస్ ఎక్కువగా ప్రచారం అవుతున్నట్టు వెల్లడించింది. వాస్తవాలను పరిశీలించకుండానే ప్రభుత్వం లేదా వ్యక్తులపై నకిలీ వార్తలను సోషల్ మీడియాలో పెంపొందించడం ఆగ్రహాన్ని సృష్టిస్తోంది.తాజాగా తిరుమల క్యూలైన్లో భక్తురాలు పాము కాటుకు గురి అయ్యిందని వ్యాప్తి చెందిన వార్తలో నిజం లేదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా అధికారిక వివరణ కూడా విడుదల చేశారు.వాస్తవానికి, ఫిబ్రవరి 22, 2026 రాత్రి వరంగల్‌కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు స్వామి దర్శనం కోసం టాక్సీ ద్వారా ఎస్వీ మ్యూజియం వద్దకు వచ్చారు. ఆర్.బి. సెంటర్ పార్కింగ్‌లో, మౌనిక తన కాలికి పసుపు రాసుకునే ప్రయత్నంలో కిందకు దిగినప్పుడు ఏదో తాకడంతో భయంతో గట్టిగా అరిచారు.వెంటనే భర్త శరత్ బాబు దగ్గరికి వెళ్లి చూసినప్పుడు అక్కడ ఒక పాము పిల్ల కనిపించింది. సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై మౌనికను తిరుమల అశ్విని హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. వైద్యుల పరిశీలనలో మౌనిక పాముకాటుకు గురి కాలేదని నిర్ధారించారు. అయినప్పటికీ భక్తురాలి సురక్షితతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తగా ఆమెను తిరుపతిలోని స్విమ్స్‌లో చేర్చారు.స్విమ్స్ డాక్టర్లు కూడా మౌనికకు పాము కాటు కలిగినట్లేదని చెప్పారు. అక్కడ కనిపించిన పాము విషరహిత సర్పం అని తేలింది. ఘటన జరిగిన వెంటనే టీటీడీ సిబ్బంది స్పందించారని, ఆ దంపతులు వారి సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తరువాతి రోజు ఉదయం, ఆ దంపతులు స్వామిని దర్శించుకున్నారు.కాబట్టి, తిరుమల క్యూలైన్లో భక్తురాలు పాము కాటుకు గురి అయినట్లుగా కొందరు వ్యాప్తి చేస్తున్న ఫేక్ వార్తలను భక్తులు నమ్మవద్దు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa