ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎలాంటి ఉద్వేగాలు ఉంటాయో తెలిసిందే కదా. గతంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మ్యాచ్‌కు కూడా ఇలాంటి క్రేజ్ ఉండేది. ఇరు జట్లూ కూడా విజయం కోసం నువ్వా, నేనా అన్నట్లు పోరాడేవి. అయితే 2018లో కేప్‌టౌన్ టెస్టులో జరిగిన ఓ ఘటన.. ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసింది. దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు.. విమర్శలకు దారి తీసింది. ఈ ఘటన జరిగిన ఎనిమిదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు.. మరోసారి ప్రొటీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడేందుకు సిద్ణమైంది.
2018లో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచులో.. సాడ్ పేపర్ గేట్ వివాదం తెరపైకి వచ్చింది. మ్యాచ్ జరుగుతుండగా.. బంతి ఆకారాన్ని మార్చేందుకు.. ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాప్ట్ సాండ్ పేపర్‌తో రుద్దడం వీడియోల్లో రికార్డైంది. అతడికి కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సహకరించినట్లు తేలడంతో.. ఈ ముగ్గురిపై ఆస్ట్రేలియా క్రికెట్ నిషేధం విధించింది. స్మిత్ కెప్టెన్సీ కోల్పోవడంతో పాటు.. ఏడాది నిషేధం ఎదుర్కొన్నాడు. వార్నర్‌పై కూడా ఏడాది నిషేధం పడింది. బాన్ క్రాఫ్ట్ 9 నెలల సస్పెన్షన్‌కు గురయ్యాడు.
ఈ సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా.. మళ్లీ ప్రొటీస్ గడ్డపై టెస్ట్ మ్యాచ్ ఆడలేడు. 8 ఏళ్ల విరామం తర్వాత.. ఆసీస్ మళ్లీ దక్షిణాఫ్రికాతో సుదర్ఘఫార్మాట్లో తలపడేందుకు సిద్ధమైంది. ఈ రెండు జట్ల మధ్య ఈ ఏడాది అక్టోబర్‌లో 3 టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ సైతం విడుదలైంది. ఈ సిరీస్‌కు ముందు వన్డే సిరీస్ సైతం జరగనుంది. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా పర్యటన షెడ్యూల్..
తొలి వన్డే – సెప్టెంబర్ 24
రెండో వన్డే -సెప్టెంబర్ 27
మూడో వన్డే – సెప్టెంబర్ 30
తొలి టెస్టు - అక్టోబర్ 9-13
రెండో టెస్టు - అక్టోబర్ 18-22
మూడో టెస్టు - అక్టోబర్ 27-31
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa