ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవాలయాల పవిత్రత దెబ్బతిన్న సందర్భాలు చూసాం..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 25, 2026, 02:20 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లో దేవాదాయ శాఖపై జరిగిన చర్చలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ, భారతదేశ గొప్పతనం, బలం దేశ విలువలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాల సమాహారమని, వీటికి దేవాలయాలు నిలయాలని అన్నారు. ప్రాచీన కాలం నుండి దేవాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా, ఆధ్యాత్మిక తత్వజ్ఞాన ప్రయోగశాలలుగా వెలుగొందుతున్నాయని గుర్తుచేశారు. అయితే గత పాలకుల హయాంలో దేవాలయాల పవిత్రత దెబ్బతిన్న సందర్భాలు చూశామని, ఆలయాభరణాలను నగల దుకాణాల ఆభరణాలుగా చూసే స్థాయికి దిగజార్చడం, ప్రసాదాల విషయంలో కల్తీలు, అక్రమాలు జరగడం వంటి ఘటనలు అత్యంత హేయమని మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa