ఆకివీడులో శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ కల్యాణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ద్వితీయ వార్షిక కల్యాణ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గణపతి పూజ, ధ్వజారోహణం, అంకురారోపణ, వాస్తుపూజ, పుణ్యాహవచనం, దీక్షా ధారణ, పంచగ్రావ్య ప్రాసన, అగ్ని ప్రతిష్ట, ఆయుధ పూజ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. మోరా శ్రీనివాస రెడ్డి దంపతులచే పండితులు పూజా కార్యక్రమాలను నిర్వహించగా, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa