ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవర్‌ఫుల్ బ్యాటరీ, స్ట్రాంగ్ బాడీ.. రూ.9,999కే 5G స్మార్ట్‌ఫోన్

Technology |  Suryaa Desk  | Published : Fri, Feb 27, 2026, 10:19 PM

భారత్ మార్కెట్‌లో OPPO India ఈ ఏడాది పలు కొత్త స్మార్ట్‌ఫోన్ మోడళ్లను విడుదల చేసింది. వాటిలో ఒప్పో A6 ప్రో, ఒప్పో రెనో 15, ఒప్పో A6 ప్రో 5G, ఒప్పో K14x 5G వంటి డివైసులు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.అయితే గత ఏడాది లాంచ్ అయిన OPPO A5x 5G ఇప్పుడు రూ.10 వేల లోపే లభిస్తోంది. బడ్జెట్ ధరలో వచ్చినప్పటికీ ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ రెసిస్టెన్స్, పలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, HD+ డిస్‌ప్లే, IP65 రేటింగ్, భారీ 6000mAh బ్యాటరీ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ప్రస్తుతం Flipkartలో ఈ హ్యాండ్‌సెట్ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. కలర్ మరియు స్టోరేజ్ వేరియంట్‌ల ఆధారంగా ధరల్లో తేడా ఉంటుంది.
*ధరల వివరాలు : ఫ్లిప్‌కార్ట్‌లో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ (లేజర్ వైట్) మోడల్ ధర రూ.13,480. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,890గా లిస్ట్ అయింది. ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, లేజర్ వైట్ రంగుల్లో లభిస్తోంది.
*స్పెసిఫికేషన్లు : ఈ స్మార్ట్‌ఫోన్ మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ డిజైన్‌తో పాటు SGS గోల్డ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గ్లౌవ్ టచ్, స్ప్లాష్ టచ్ సపోర్ట్ ఉండటంతో తడి చేతులతో లేదా గ్లౌవ్స్ ధరించి కూడా ఫోన్ ఉపయోగించవచ్చు.పనితీరు పరంగా మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15పై పనిచేస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh భారీ బ్యాటరీ అందించారు. కెమెరా విభాగంలో 32MP ప్రైమరీ కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.అలాగే ట్రినిటీ ఇంజిన్ సపోర్ట్‌తో పాటు AI Eraser 2.0, AI Unblur, AI Clarity Enhancer, AI Smart Image Matting 2.0, Reflection Remover వంటి అనేక AI ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.కనెక్టివిటీ విషయానికొస్తే 5G, 4G, బ్లూటూత్ 5.1, వైఫై 5, GPS, USB Type-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ అందించగా, భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa