టీమిండియా హెడ్ కోచ్ Gautam Gambhir, కెప్టెన్ Suryakumar Yadavలకు తన హాఫ్ సెంచరీని అంకితం చేస్తున్నట్లు విధ్వంసకర ఓపెనర్ Abhishek Sharma వెల్లడించాడు. వరుసగా విఫలమైన సందర్భాల్లో కూడా తనపై నమ్మకం కోల్పోకుండా అండగా నిలిచారని ఆయన చెప్పాడు. మళ్లీ డకౌట్ అయినా జట్టు నుంచి తప్పించబోమని కోచ్, కెప్టెన్ ధైర్యం ఇచ్చారని పేర్కొన్నాడు.ICC Men's T20 World Cupలో అభిషేక్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ ఆశించిన ప్రదర్శన ఇవ్వకపోయినా టీమ్ మేనేజ్మెంట్ పూర్తి మద్దతు ఇచ్చింది.జింబాబ్వేతో గురువారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం అతడు ఫామ్‌లోకి వచ్చాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్, జట్టు మద్దతుపై అభిషేక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.“నా కంటే నా సహచరులకే నాపై ఎక్కువ నమ్మకం ఉంది. హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాను. నేను ఇంకా నా అత్యుత్తమ ఆటను చూపాల్సి ఉంది. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. మేమంతా ఒక కుటుంబంలా ఉంటాం. అందుకే నా నుంచి బెస్ట్ ప్రదర్శన రావాలని అందరూ ఆశించారు. ఆ రోజు తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను,” అని తెలిపాడు.టీ20 ప్రపంచకప్ ప్రారంభ సమయంలో తన ఆరోగ్యం సరిగా లేకపోయిందని, ముందుగా ఆసుపత్రిలో కూడా చేరాల్సి వచ్చిందని వెల్లడించాడు. మెగా టోర్నీలో దేశం తరఫున తొలి మ్యాచ్ ఆడేటప్పుడు మంచి ఆరంభం కావాలనుకున్నానని, కానీ అది సాధ్యపడలేదని చెప్పాడు. అయినప్పటికీ జట్టు నుంచి అదే స్థాయి మద్దతు కొనసాగుతోందని స్పష్టం చేశాడు“ప్రత్యేకంగా గంభీర్ సర్, సూర్యభాయ్ నాపై అపార నమ్మకం ఉంచారు. ఇంకోసారి డకౌట్ అయినా పక్కన పెట్టబోమని, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాలన్నారు. అందుకే జింబాబ్వేపై సాధించిన హాఫ్ సెంచరీని నా సహచరులు, కోచ్, కెప్టెన్‌కు అంకితం చేస్తున్నాను,” అని అభిషేక్ శర్మ పేర్కొన్నాడు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa