అనకాపల్లి జిల్లా కేంద్రంలో రూ.100 కోట్ల విలువైన దేవాదాయశాఖ భూములను కొంతమంది అక్రమార్కులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలకడం దారుణం అని అనకాపల్లి వైసీపీ సమన్వయకర్త మలసాల భరత్ అన్నారు. 22 సీ లో ఉన్న ఈ సత్రం భూమని 22 ఏ లోకి మార్చి... తద్వారా అధికార పార్టీకి కావాల్సిన వారికి కట్టజెప్పే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఇందులో సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పాత్ర ఉండడం మరింత విచారకరమన్న భరత్.... దీనిపై సీబీఐతో విచారణ చేయించి, బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa