ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఒక అవసరంగా మారింది. అయితే, రిఫ్రిజిరేటర్ తలుపును తరచుగా, ఎక్కువసేపు తెరవడం వల్ల చల్లని గాలి బయటకు వెళ్లి, కంప్రెసర్ ఎక్కువ పనిచేయాల్సి వస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. దీనివల్ల విద్యుత్ బిల్లు పెరగడమే కాకుండా, కంప్రెసర్ త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. ఆహారం చెడిపోవడం, బ్యాక్టీరియా పెరగడం, తేమ పెరిగి మంచు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. తలుపు సీల్ కూడా దెబ్బతింటుంది. ఈ అలవాటు వల్ల రిఫ్రిజిరేటర్ జీవితకాలం తగ్గి, ఖరీదైన మరమ్మతులకు దారితీయవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa