ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేట్లపాలెంలో ఘోర ప్రమాదంలో 20 మంది సజీవ దహనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 02:21 PM

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘోర ప్రమాదంలో 20 మంది కార్మికులు సజీవ దహనం కాగా, మరో పది మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఆర్డీవో మల్లిబాబు స్పందించారు. ఈ బాణాసంచా తయారీ పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్సు ఉందని తెలిపారు. పేలుడు ఘటన అనంతరం తయారీ కేంద్రం యజమాని పరారయ్యాడని చెప్పారు. గాయపడిన వారిలో ఆరుగురు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని ఆర్డీవో తెలిపారు. బాధితుల్లో వేట్లపాలెం వాసి కప్పా వెంకట లక్ష్మి, పెద్దాపురం వాసి మోర్తా శ్రీను, సామర్లకోటకు చెందిన కె. శ్రీను, చిటికెల లక్ష్మి ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం, పొలాల మధ్యలో 6 షెడ్లు వేసి బాణసంచా తయారు చేస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. పేలుడు సంభవించడానికి కొద్దిసేపటి ముందే కొంతమంది కార్మికులు భోజనం కోసం బయటకు వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa