ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అలిరెజా అరాఫీ నియామకం

international |  Suryaa Desk  | Published : Sun, Mar 01, 2026, 07:39 PM

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన వారసుడిగా అయతొల్లా అలిరెజా అరాఫీని ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆదివారం నియమించింది. టెహ్రాన్‌లోని నివాసంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇస్లామిక్ విప్లవ నేత ఖొమేనీ మరణం తర్వాత, 1989 నుంచి ఖమేనీ ఇరాన్ అత్యున్నత నాయకుడిగా కొనసాగుతూ వచ్చారు.ఖమేనీ మరణం తర్వాత దేశ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, జ్యుడీషియరీ చీఫ్ గులాంహొస్సేన్ మొహసెని ఎజెయి, గార్డియన్ కౌన్సిల్ జ్యూరిస్ట్ ఉంటారని 'ఐఆర్‌ఎన్‌ఏ'  వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, 88 మంది సభ్యులున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ తదుపరి పూర్తిస్థాయి సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే వరకు ఈ కౌన్సిల్ బాధ్యతలు నిర్వహిస్తుంది.రష్యన్ మీడియా సంస్థ 'ఆర్టీ'  కథనం ప్రకారం 1959లో ఇరాన్‌లోని మేబోద్‌లో జన్మించిన అయతొల్లా అరాఫీ, షియా మతగురువుగా, ఇస్లామిక్ న్యాయనిపుణుడిగా పేరు పొందారు. 2016 నుంచి ఇరాన్ ఇస్లామిక్ సెమినరీస్ మేనేజ్‌మెంట్ సెంటర్ హెడ్‌గా, ప్రఖ్యాత కోమ్ సెమినరీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దేశ చట్టాలను, ఎన్నికలను పర్యవేక్షించే శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్‌లో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు. గతంలో 2008 నుంచి 2018 వరకు అల్-ముస్తఫా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా కూడా అరాఫీ పనిచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa