రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సాగు సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ దరఖాస్తులన్నింటికీ అనుమతులు జారీ చేయాలని, రెండు నెలల్లోగా కనెక్షన్లను పూర్తిగా ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కంలను) ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ కోసం సుమారు రూ.250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అవసరమైన 10,000 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను కేటాయించనుంది. ఈ విషయంపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రెండు నెలల్లోగా పెండింగ్ కనెక్షన్లన్నీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని డిస్కంలను ఆదేశించామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa