టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీలు యూజర్లకు అత్యాధునిక ఫీచర్లను, భద్రతా ప్రమాణాలను పాటిస్తూ కొత్త ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నాణ్యమైన కెమెరాలు, శక్తివంతమైన చిప్‌సెట్‌లు, భారీ బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో పెద్ద ఎఫెక్ట్ సృష్టిస్తున్నాయి.ఇటీవల శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా మోడల్‌లో ప్రైవసీ డిస్‌ప్లే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చే యూజర్ల కోసం రూపొందించిన ఈ ఫీచర్, ఫోన్‌ను ఎదురుగా చూసే వారికి స్పష్టంగా కనిపించగలిగేలా చేస్తుంది, పక్కవారికి డిస్‌ప్లే బ్లాక్‌గా కనిపిస్తుంది. ఇది మెట్రో, బస్సులు, రైళ్లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఇప్పటివరకు హానర్ కంపెనీ రోబోట్ ఫోన్ (Honor Robot Phone) ప్రోటోటైప్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 (MWC 2026) లో ప్రదర్శించింది. ఈ ఫోన్ ప్రత్యేక ఫీచర్లు, ఆకట్టుకునే స్పెసిఫికేషన్లతో గేమ్‌చేంజర్‌గా నిలిచే అవకాశం ఉంది. ముఖ్యంగా, హానర్ రోబోట్ ఫోన్‌లోని రోబోటిక్ గింబల్ కెమెరా ప్రధాన ఆకర్షణ. స్మార్ట్‌ఫోన్‌లోనే 3-యాక్సిస్ మెకానికల్ గింబల్‌ను అమర్చిన ప్రపంచంలోనే ఇది తొలి ఫోన్. 200MP కెమెరా, 40 డిగ్రీల ఫ్రీడమ్ మోషన్ కంట్రోల్ సామర్థ్యంతో రియల్ లైఫ్ రోబో అనుభవాన్ని అందిస్తుంది.ఈ రోబోటిక్ గింబల్ రోబో చేతి తరహాలో ప్రవర్తిస్తుంది. 90° లేదా 180° కోణాల్లో ఆటోమేటిక్‌గా తిరిగి, ఫోటోలు, వీడియోలను ప్రొఫెషనల్ స్థాయిలో రికార్డ్ చేయగలదు. AI ఫీచర్ కారణంగా కదులుతున్న వస్తువులు, మనుషుల కదలికను ఆటోమేటిక్‌గా ట్రాక్ చేసి స్మూత్‌గా క్యాప్చర్ చేయగలదు. అదనంగా, తల ఊపడం ద్వారా “అవును” లేదా “కాదు” సమాధానాలను కూడా ఇవ్వగలదు.హానర్ రోబోట్ ఫోన్ హానర్ మ్యాజిక్ V6 ఆధారంగా రూపొందించబడింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఇలైట్ చిప్, సిలికాన్ కార్బన్ బ్లేట్ బ్యాటరీ అమర్చబడింది. భారీ సామర్థ్యం ఉన్నా, ఫోన్ డిజైన్ సన్నగా, స్లిమ్‌గా ఉంటుంది. ఈ రోబోట్ ఫోన్ 2026 రెండో అర్ధభాగంలో చైనా మార్కెట్‌లో లాంచ్ అవ్వవచ్చని, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లకు కూడా విడుదల కానుందని తెలుస్తోంది. భారత్‌లో విడుదలకు ఇంకా స్పష్టత లేదు, త్వరలో మరిన్ని వివరాలు తెలియవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa