అమెరికా-ఇజ్రాయెల్ దాడులను తట్టుకుంటూ ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ యుద్దంలో ఇరాన్ అమలు చేస్తున్న చౌకపాటి డ్రోన్ దాడుల వ్యూహం ప్రత్యర్థుల భారీ ఆస్తుల్ని ధ్వంసం చేస్తోంది. దీనిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇరాన్ యుద్ధంలో ఒక పాఠం స్పష్టంగా ఉందని, తక్కువ ధర "ఆత్మాహుతి" డ్రోన్లను అధిక ధర గల వాయు రక్షణ వ్యవస్థలను ముంచెత్తడానికి ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. భారతదేశం ఈ మార్పుకు ముందు ఉండాలని సూచించారు. పెద్ద, ఆధునిక డ్రోన్ ఆయుధశాల, బలమైన ప్రతి-డ్రోన్ సామర్థ్యాలను నిర్మించడం ద్వారా యుద్దానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సలహా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa