ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ICC Men's T20 World Cup 2026: భారత్ విధ్వంసం.. ఇంగ్లాండ్‌పై భారీ స్కోర్, సెమీఫైనల్‌లో నరాలు తెగే ఉత్కంఠ!

sports |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 09:24 PM

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు ఈ రోజు తలపడుతున్నాయి. ముంబైలోని Wankhede Stadium వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ నమోదు చేసింది.సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే అద్భుతమైన బ్యాటింగ్‌తో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. దీంతో ఫైనల్‌కు చేరాలంటే ఇంగ్లాండ్ జట్టు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాల్సి ఉంది. ఇది ICC Men's T20 World Cup నాకౌట్ మ్యాచ్‌లలో నమోదైన అత్యధిక స్కోర్‌గా నిలిచింది.సంజు శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 89 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ (39), శివమ్ దూబే (43) కూడా దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టు స్కోరును వేగంగా పెంచారు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) పవర్ హిట్టింగ్‌తో భారత్ 250 పరుగుల మార్క్ దాటింది.ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఇంగ్లాండ్ జట్టు భారీ ఛేజ్‌తో చరిత్ర సృష్టించాల్సి ఉంటుంది.ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో తిలక్ వర్మ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. అయితే అదే ఓవర్ ఐదో బంతికి ఆర్చర్ అతన్ని బౌల్డ్ చేశాడు. తిలక్ కేవలం 7 బంతుల్లోనే 21 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ సమయంలో భారత స్కోరు 236/6గా ఉంది.ఇక 18వ ఓవర్‌లో శివమ్ దూబే రనౌట్‌గా వెనుదిరిగాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి రెండో పరుగు కోసం ప్రయత్నించిన సమయంలో అతను రనౌట్ అయ్యాడు. దూబే 25 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. 18 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 217/5గా నిలిచింది.17వ ఓవర్‌లో హార్దిక్ పాండ్యా మూడు ఫోర్లు బాది భారత్ స్కోరును 200 పరుగుల మైలురాయిని దాటించాడు. ఆ ఓవర్‌లో జేమీ ఓవర్టన్ 15 పరుగులు ఇచ్చాడు. 17 ఓవర్లు ముగిసేసరికి భారత్ 205/4తో బలమైన స్థితిలో ఉంది.సెంచరీ దిశగా సాగుతున్న సంజు శాంసన్ 14వ ఓవర్‌లో అవుట్ అయ్యాడు. విల్ జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చాడు. అయినప్పటికీ శాంసన్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి భారత్‌కు భారీ స్కోర్‌కు బాటలు వేసాడు. ఆ సమయంలో భారత్ స్కోరు 160/3గా ఉంది.అంతకుముందు సంజు శాంసన్ వరుసగా రెండో మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించాడు. లియామ్ డాసన్ వేసిన 8వ ఓవర్‌లో సిక్సర్ బాది కేవలం 26 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 8 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 92/1గా ఉంది.భారత్ తన ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. రేహాన్ అహ్మద్ స్థానంలో జేమీ ఓవర్టన్‌కు అవకాశం ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 8న అహ్మదాబాద్‌లోని Narendra Modi Stadium వేదికగా జరిగే ఫైనల్‌లో న్యూజీలాండ్‌ను ఎదుర్కొంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa