ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవి కాలంలో గుడ్ల ధరల తగ్గుదల

business |  Suryaa Desk  | Published : Thu, Mar 05, 2026, 09:39 PM

కోడిగుడ్డు ధరలు భారీగా తగ్గాయి. సాధారణంగా వేసవి కాలంలో గుడ్ల ధరలు తగ్గుతుంటాయి. కానీ ఈసారి ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ఒక్కసారిగా దారుణంగా పతనమయ్యాయి. పరస్పర దాడులతో పశ్చిమాసియా రగులుతోంది. ఆరు రోజులుగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దేశాలు పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. దీనితో ఎక్కడికక్కడ ఎగుమతులు నిలిచిపోవడం కూడా గుడ్ల ధరలు పడిపోవడానికి కారణం.ఎగుమతులు నిలిచిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమకు భారీ మొత్తంలో నష్టం చేకూరుతుంది. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా పోర్టులు, ఎయిర్ పోర్టులు మూసివేయడం పౌల్ట్రీ పరిశ్రమపై భారీ ప్రభావం పడుతోంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ ధర రూ.4.20కి పడిపోయింది. ఎగుమతులు నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాల్లో గుడ్డు ధర రూ.3.30కి కూడా పడిపోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa