ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సివిల్స్ 2025లో టాపర్‌గా డాక్టర్ అనూజ్ అగ్నిహోత్రి.. సత్తాచాటి పలువురు తెలుగోళ్లు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 07:20 PM

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 తుది ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మెడికో అనూజ్ అగ్నిహోత్రి తొలి ర్యాంకులో నిలవగా. ఆ తర్వాత రాజేశ్వరి సువే, ఆకాన్ష్ ధుల్, రాఘవ్ ఝంఝన్‌వాలా, ఇషాన్ భట్నాగర్, జిన్నాయ్ అరోరా, ఏఆర్ రజా మొయినుద్దీన్, పక్షల్ సెక్రెటరీ, అస్థా జైన్, ఉజ్వల్ ప్రియాంక్‌లు వరుసగా మొదటి 10 స్థానాల్లో నిలిచారు. పలువురు తెలుగువారు కూడా సివిల్స్‌లో మెరిశారు. టాప్ 100లోపు మాత్రం ఒకరే ఉన్నారు. గూడెల్ల సృజన అనే తెలుగమ్మాయి 55వ ర్యాంకు సాధించారు. డీఎస్కే ప్రచేత్ 193 ర్యాంకు, వర్షిత్ రెడ్డి 259, ఎం పవన్ కుమార్ రెడ్డి 297, పల్లి ప్రమోద్ విష్ణఉ 640, వెలిమినేటి విజయ సింహారెడ్డి 682, శ్రవణ్ కుమార్ 768, కోరుపోతుల శ్రీధర్ రాజు 806, కట్టా ప్రత్యూష్ 908, గోగుల రాజశేఖర్ 920, గుగులోతు జితేందర్ నాయక్ 933 ర్యాంకు సాధించారు.


ఆలిండియా టాపర్ అనూజ్ అగ్నిహోత్రి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లా రహతా గ్రామానికి చెందిన యువకుడు. జోధ్‌పూర్ ఎయిమ్స్‌ నుంచి 2023లో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. తొలి ప్రయత్నంలోనే 2024 సివిల్స్‌కు ఎంపికైనా.. ఢిల్లీ, కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేషన్‌లో గ్రూప్ బి ఆఫీసర్‌గా చేరారు. కానీ, రెండో ప్రయత్నంలో మాత్రం మొదటి ర్యాంకుతో తన కలల కొలువు సాధించారు.


మొత్తం 958 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా.. వీరిలో జనరల్ 317, ఈడబ్ల్యూఎస్ 104, ఓబీసీ 306, ఎస్టీ 158, ఎస్టీ 73 మంది ఉన్నారు. మొత్తం 1087 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసినా.. 130కిపైగా పోస్టులకు అర్హులైనవారు లేకపోవడంతో పక్కనబెట్టింది. ఐఏఎస్ 180, ఐఎఫ్ఎస్ 55, ఐపీఎస్ 150, గ్రూప్-ఏ (సెంట్రల్ సర్వీసెస్) 507, గ్రూప్-బి సర్వీసెస్ 195 ఖాళీలు ఉన్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది.


గతేడాది మే 22న ప్రిలిమ్స్ నిర్వహించిన యూపీఎస్సీ.. ఇందులో అర్హత సాధించిన వారికి ఆగస్టు 22 నుంచి 31 వరకు మెయిన్స్ నిర్వహించింది. మెయిన్స్‌లో సత్తాచాటిన వారికి ఫిబ్రవరి 27తో ఇంటర్వ్యూలు పూర్తికాగా.. వారం రోజుల్లోనే తుది ఫలితాలను ప్రకటించింది. అయితే, 2022, 2023, 2024 నోటిఫికేషన్లకు ఈ విధంగానే ఫలితాలను వెల్లడించింది. 2024 సివిల్స్ ఇంటర్వ్యూలో 2025 ఏప్రిల్ 17న పూర్తికాగా.. ఫలితాలు ఏప్రిల్ 22న వెలువడ్డాయి. అంతకుముందు 2023 నోటిఫికేషన్‌కు సంబంధించి ఏప్రిల్ 9, 2024లో ఇంటర్వ్యూలు పూర్తయితే.. ఏప్రిల్ 16 ఫలితాలను వెల్లడించింది. అలాగే, 2023 మే 18న ఇంటర్వ్యూలు పూర్తికాగా.. ఫలితాలు మే 23న ఇచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa