ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంపై స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు

international |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 08:09 PM

అమెరికా ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత తీవ్రతరమైన ఉద్రిక్తతలను తగ్గించేందుకు కొన్ని దేశాలు మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ప్రారంభించాయి అని ఆయన శుక్రవారం ప్రకటించారు. ప్రాంతీయ శాంతికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే ఇరాన్ ప్రజల శక్తిని తక్కువగా అంచనా వేసిన వారికి ఈ మధ్యవర్తిత్వం సరైన సమాధానం కావాలని ఆయన 'ఎక్స్' వేదికగా స్పష్టం చేశారు. తమ దేశ గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చిచెప్పారు.అధ్యక్షుడి ప్రకటన ఒకవైపు ఉండగా క్షేత్రస్థాయిలో ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ తన అత్యంత శక్తివంతమైన 'ఖొర్రమ్‌షహర్-4' బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని తస్నిమ్ వార్తా సంస్థ వెల్లడించింది.ఆపరేషన్ ట్రూ ప్రామిస్-4లో భాగంగా 22వ విడత దాడులు మొదలయ్యాయని, ఇవి నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడుతున్నాయని ఇస్లామిక్ రెవెల్యూషన్ గార్డ్ కోర్  తెలిపింది. మరోవైపు, లెబనాన్‌లోని సిడాన్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఓ నివాస భవనం దెబ్బతిన్నట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించిందిమరోవైపు, ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'ని మరింత ఉధృతం చేస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. ఫ్లోరిడాలోని టాంపాలో ఉన్న సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ నావికాదళాన్ని, క్షిపణి కేంద్రాలను తమ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని తెలిపారు.మేము ఈ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, విజయం సాధించే దిశగా వెళ్తున్నాం అని ఆయన వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa