ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రోడ్లో ప్రయాణించాలంటే నరకమే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 11:33 AM

గుంటూరు నుంచి రాజధాని అమరావతికి తాడికొండ మీదుగా వెళ్లే మార్గంలో పెదపరిమి నుంచి తుళ్లూరు వరకు రోడ్డు అత్యంత దారుణంగా తయారైంది. భారీ గోతులతో కార్లు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రాజధాని నిర్మాణానికి అవసరమైన గ్రావెల్, కంకర తరలింపునకు 60 టన్నుల బరువుతో తిరుగుతున్న వాహనాల వల్ల రోడ్డు ధ్వంసమైంది. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకిరువైపులా ఉన్న పంటలపై దుమ్ము పడి దిగుబడులపై ప్రభావం చూపుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa