ఏపీలో అక్రమ మద్యం వ్యవహారంపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో అక్రమ మద్యం కారణంగా వేల కుటుంబాలు నాశనమయ్యాయని, అదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ అనుచరుల జేబుల్లో వేల కోట్లు చేరాయని ఆరోపించారు. కోట్ల రూపాయల నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ బయటపెట్టిందని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై జగన్ ప్రజలకు సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. ఒకవేళ స్పందించకపోవడమే జగన్ సమాధానమా? అని నిలదీశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa